వామనరావు హత్య వెనుక రాజకీయ కుట్ర…
తెలంగాణలో న్యాయవాదులైన వామనరావు హత్య రాజకీయ మలుపులు తిరుగుతుంది. పెద్దపల్లి జిల్లాలోని మంథని సమీపంలో హైకోర్టు న్యాయవాది వామనరావు దంపతులను అతి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే హత్య చేయడం అందరినీ హతాశులను చేసింది. ఈ హత్యపై ప్రతిపక్షాలు ఇప్పటికే నిరసనలు తెలుపుతున్నారు.
అయితే తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై నిందితులకు కఠిన శిక్ష విధించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. వామనరావు దంపతుల హత్యపై అయన తండ్రి కిషన్ రావు కూడా స్పందించి కేసు కూడా పెట్టారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. వామనరావు హత్య కేసులో రాజకీయ ప్రమేయం ఉందని తన అనుమానాన్ని వ్యక్తం చేశారు. తనకు స్థానిక పోలీసులపై ఏమాత్రం నమ్మకం లేదని, ఆలయ వివాదం వల్లే హత్య జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉందని తెలిపారు. అయితే అందులో ఏమాత్రం వాస్తవం లేదని, అవినీతిపై పోరాటం చేస్తున్నందుకే హత్యకు కుట్ర జరిపారని ఆయన స్పష్టం చేశారు. అలాగే.. హత్యతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ శిక్షపడాలని వామనరావు తండ్రి కిషన్ రావు వివరించడంతో కేసు కొత్త మలుపు తిరుగుతుంది.