తాగి కారు నడిపి పోలీసులకి దొరికిన యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్
ఈ మధ్యకాలంలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో ఎవరో ఒక పెద్దమనుషులకు చెందిన పిల్లలో లేదా సినిమా సెలబ్రేటీలో బాద్యులవడం పరిపాటిగా మారింది. లిస్ట్ చూసుకుంటే చిన్న పెద్ద అంతకలిసి చాంతాడంత పొడవుంటుంది అయితే ఈసారి మాత్రం షెన్ను వంతయ్యింది అదేనండి షన్ను అంటే యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్.అదేనండి ఆ మధ్య బిగ్ బాస్ 3 ఫేమ్ దీప్తి సునయన బాయ్ ఫ్రెండ్ గా ఫేమసయ్యాడే అతనే, యూట్యూబ్ షణ్ముఖ్ జస్వంత్.
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో కారు నడిపిన షణ్ముఖ్ జస్వంత్ మూడు వాహనాలను ఢీ కొట్టిన సంఘటనలో ఒక ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు కాగా పోలీసులు చేసిన ` బ్రీత్ ఎనలైజర్ లో షణ్ముఖ్ జస్వంత్ కు 170 రీడింగ్ చూపించినట్లుగా సమాచారం. కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.