మొదట కరోనా సంగతి తేలుస్తా: దీదీ
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి.. మమతా బెనర్జీ ప్రభుత్వం ఘన విజయం సాధించింది. దీంతో మమతా ఖుషీ ఖుషీగా ఉన్నారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటికీ.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు మాత్రం ఏమాత్రం తగ్గడంలేదు. అక్కడక్కడ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.
ఇలాంటి ఈ సమయంలో ఈ ఘటనలపై స్పందించిన టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ… తాను స్ట్రీట్ ఫైటర్ను మాత్రమేనని.. ఒంటరిగా పోరాటం చేయలేమని అన్నారు. అయితే తాను బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేయడానికి సిద్ధం చేస్తానని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల కోసం అందరమూ కలిసి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు దీదీ. అదేవిధంగా అంతకంటే ముందు.. కోవిడ్పై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కోసం 30,000 కోట్లను కేటాయించాలని కేంద్రాన్ని కోరారు మమతా బెనర్జీ. అలాగే కొన్ని రాష్ట్రాలకు మాత్రమే కేంద్రం ఆక్సిజన్ను పంపిస్తోందని మమతా ఆరోపనాస్త్రాలు సంధించారు.