మేడ్చల్ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?
తెలంగాణలో మేడ్చల్ నియోజకవర్గం సమ్‌థింగ్ స్పెషల్. జెట్ స్పీడ్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. పొలిటికల్‌గా చూసుకుంటే రాష్ట్రంలోనే హాట్ టాపిక్. ఇక్కడి నుంచి మళ్లీ గెలిచేదెవరు అనే విషయము ఇప్పుడు ఇక్కడ బర్నింగ్ టాపిక్. అయితే ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ చాప కింద నీరులా దూసుకువస్తోంది. దీంతో స్థానిక కాంగ్రెస్ నాయకులపై అందరి దృష్టిపడుతోంది.
నిజానికి మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలం కూడా భారీగానే ఉంది. ఈ నేపథ్యంలో టికెట్ ఎవరికి అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్. ఈ క్రమంలో నియోజకవర్గంలో గట్టిగా వినిపిస్తున్న పేరు తోటకూర జంగయ్య యాదవ్ ఆలియస్ వజ్రేష్ యాదవ్. ప్రస్తుతం టీ-పీసీసీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న వజ్రేష్ యాదవ్.. రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరుడు కావడంతో కాంగ్రెస్ నుంచి ఆయనకు సీటు ఖరారు అయినట్టే అనే టాక్ వినిపిస్తుంది. కుల గణాంకాలు.. రేవంత్ రెడ్డి చరీష్మా.. స్థానిక ఎంపీగా తన పలుకుబడి, గత ఎన్నికల అనుభవం, ఆ ఎన్నికలలో ఓటమి తో పెరిగిన సానుభూతి, ప్రధానంగా బీసీ వర్గం నుంచి మద్దతు వుండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవల స్థానికంగా కాంగ్రెస్ బలం పుంజుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ సారి ఎన్నికలలో ‘రెడ్డి’ వర్గాన్ని కాదని బీసీ వర్గానికి కనుక కాంగ్రెస్ టికెట్ ఇస్తే మాత్రం తోటకూరకు గెలుపు అవకాశాలు ఎక్కువే.
మొత్తమ్మీద మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఈ ప్రధాన పార్టీల టికెట్‌లను అందుకునే అభ్యర్థులను బట్టి పరిస్థితులు కాస్తా అటు ఇటు కావచ్చనే మాట వినిపిస్తోంది.