విద్యార్థుల ప్రతిభ వెలికి తీస్తా: ఇంపాక్ట్ ట్రైనర్ మేడిశెట్టి శ్రీనివాస్
గంపా నాగేశ్వర రావు ఆధ్వర్యంలోని ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌లో 30 రోజుల ట్రైనింగ్ సెషన్స్ ‘TRAIN THE TRAINER WORKSHOP – 136th Batch’ ను విజయవంతంగా ముగించుకుని, అటెండెన్స్, అసైన్మెంట్స్ లో ఉత్తమ ప్రతిభ చూపించిన మేడిశెట్టి శ్రీనివాస్ ఇంపాక్ట్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా.ఆది నారాయణ రెడ్డి, కోర్ టీం సభ్యుల చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు.
ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకోవడం, నేర్చుకోవడం జరిగిందని, తాను తెలుసుకున్న, నేర్చుకున్న విషయాలను ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచేటట్లు, వారు మానసికంగా ఒత్తిడికి లోను కాకుండా చదువులో అభివృద్ధి చెందేటట్లు, వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి, వారు భవిష్యత్తులో ఏది సాధించాలని అనుకుంటున్నారో దానిపై అవగాహన కల్పించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ద్వారా తమ వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ‘మేడిశెట్టి శ్రీనివాస్’ తెలిపారు.
ఈ విజయానికి సహకారం అందించినటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ ఇన్చార్జెస్ (భాస్కర రావు, కిషోర్ రెడ్డి), కో-ఆర్డినేటర్స్(రవీంద్ర, చక్రి), మెంటార్స్ (నారగోని శ్రీనివాస్, P. విజయలక్ష్మి, K.శ్రీనివాస్, సత్యనారాయణ, K.J.సుదీప్తి, నరేందర్) లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.