‘Rx 100’ బ్యూటీ మరోసారి అదే తరహాలో…!

టాలీవుడ్ లో ‘Rx 100’ సినిమాతో సంచల తారగా పేరు తెచ్చుకుంది పాయల్ రాజ్ పుత్. అందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించి కుర్రకారును ఓ ఊపు ఊపింది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ తో ఆడియన్స్ మెప్పిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ప్రాధాన్యం లేని పాత్రల ఎంపికతో స్టార్ స్టేటస్ అందుకోలేక పోయింది ఇప్పటివరకు ఈ భామ. ‘RX 100’ తర్వాత ‘వెంకీ మామ’ ‘డిస్కోరాజా’ వంటి స్టార్ హీరోల సినిమాలలో నటించినా అవి ఆమె కెరీర్ ను అంతగా గాడిలో పెట్టలేకపోయాయి. అంతేకాకుండా ఐటెమ్ సాంగ్స్ తో కూడా కుర్రకారును కిర్రెక్కించింది.
అదేవిధంగా ‘అనగనగా ఓ అతిథి’ అనే వెబ్ మూవీతో ఓటీటీ వరల్డ్ లో ఎంటరైంది. అయినా అమ్మడిని సక్సెస్ అంతగా పలకరించలేదు. తాజాగా తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ఆహా తీస్తున్న ‘త్రీ రోజెస్’ అనే వెబ్ సిరీస్ లో పాయల్ అవకాశం దక్కించుకుందనే టాక్ నడుస్తుంది. కాగా ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇందులో కూడా పాయల్ సీరియస్ పాత్రనే పోషిస్తోందని సమాచారం. దీంతో ఆర్ ఎక్ 100 వలె నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రనే చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగులోనే కాకుండా పాయల్ తమిళంలో ఉదయనిధి స్టాలిన్ తో ‘ఏంజెల్’ అనే హారర్ థ్రిల్లర్ లో నటిస్తోంది. మరి రాబోయే కాలంలో పాయల్ స్టార్ స్టేటస్ తో కుర్రకారును ఊపాలని కోరుకుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *