తిరుమల దర్శనానికి తగ్గిన భక్తుల సంఖ్య
ఆంధ్రప్రదేశ్ లో కరోనా విలయ తాండవం చేస్తుంది. రోజుకి 20వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఈరోజు నుంచి ఏపీ వ్యాప్తంగా మధ్యాహ్నం 12 గంటలు మినీ లాక్ డౌన్ ప్రకటించింది ప్రభుత్వం. దీంతో ఈనెల 18వ తేదీవరకు మధ్యాహ్నం వరకే అన్ని షాపులు, రవాణా సౌకర్యం కొనసాగుతుంది. ఆ తర్వాత అంతా స్థంభించిపోనుంది.
అయితే కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండటంతో తిరుమలలో శ్రీవారిని దర్శించుకునే భక్తులు సంఖ్య గణనీయంగా తగ్గింది. నిన్నటి రోజున టిటిడి చరిత్రలోనే అత్యంత తక్కువ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించకున్న వారి ఉన్నారు. నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 4723 మంది కాగా, 2669 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
కాగా నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 39 లక్షలుగా తేలింది. అదేవిధంగా దర్శన టోకెన్లు కలిగిన భక్తులను అలిపిరి వద్ద మధ్యాహ్నం 12 గంటల తర్వాత కూడా టిటిడి అనుమతించనుంది. ఈరోజు నుంచి ఏపీలో పగటిపూట కూడా కర్ఫ్యూ నిబంధనలు అమలు కానుండగా.. తిరుమలకు యథావిధిగా ఆర్టీసీ బస్సులు సేవలు అందుబాటులో ఉండనున్నాయి. కర్ప్యూ సమయంలో కూడా భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ తిరుమలకు బస్సులు నడపనుండటం విశేషం.