భారీ రీమేక్ లో సాయిపల్లవి కాదని… నిత్యాకి ఛాన్స్..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ హీరో రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియం’ తెలుగు రీమేక్. కోవిడ్ సెకండ్ వేవ్ తో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. అలాగే పవన్ కూడా కోవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ ఆయన పూర్తి ఆరోగ్యంగా మారే వరకు సినిమా షూటింగ్ ప్రారంభంకాదు.
అయితే ఈ సినిమా పవన్ తో సాయి పల్లవి జోడి కట్టనుందని అప్పట్లో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అదేంటో గానీ చివరి క్షణంలో సాయి పల్లవి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో నిర్మాతలు సాయి పల్లవి స్థానంలో నిత్యా మీనన్ ను తీసుకున్నారు. అయితే తాజాగా సాయి పల్లవి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి గల కారణం ఏంటో సమాచారం అందుతుంది. అదేమంటే… ఈ సినిమాలో నటించడానికి సాయి పల్లవి 3 కోట్ల రూపాయలు పారితోషికంగా డిమాండ్ చేశారని సమాచారం. అయితే ఈ రౌడీ బ్యూటీ రోల్ నిడివి తక్కువగా ఉంటుందని, అటువంటి చిన్న పాత్రకోసం సాయి పల్లవి అడిగిన రెమ్యూనరేషన్ ఎక్కువని భావించిన మేకర్స్ ఆమె స్థానంలో నిత్యా మీనన్ ను తీసుకున్నారని తెలుస్తోంది.
అంతేకాకుండా నిత్యామీనన్ ఈ సినిమాకి తక్కువ రెమ్యూనరేషన్ కే ఓకే చేసినట్టు సమాచారం. దీంతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ రీమేక్‌లో పవన్ కళ్యాణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనుంది నిత్యా. కానీ సాయి పల్లవి గతంలో రెమ్యూనరేషన్ వంటి పట్టింపులు పట్టించుకోదు. సాయిపల్లవి రెమ్యునరేషన్ వార్తల్లో నిజమెంతుందే తెలియాలంటే రౌడీబేబి స్పందించాల్సిందే.