వైరల్: మరక్కల్ సెట్ లో కీర్తి సురేష్ ఫోజు…
అనతి కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయికామణి కీర్తి సురేష్. మహానటితో కీర్తి ఇమేజ్ మరింత ఇనుమడించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సీనియర్ హీరో మోహన్లాల్ తాజాగా నటించిన సినిమా ‘మరక్కర్’. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తీ సురేష్, మంజు వారియర్, అర్జున్, కల్యాణీ ప్రియదర్శన్ కీలక పాత్రలు పోషించారు.
అయితే 16వ శతాబ్దానికి చెందిన నేవల్ కమాండర్ కుంజాలి మరక్కర్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. కాగా కీర్తిసురేష్ తన సోదరి రేవతి సురేశ్తో కలిసి పనిచేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందంటూ వెల్లడించింది. అందుకు సంబంధించి ‘మరక్కర్’ సెట్లో ఇద్దరూ కలిసి దిగిన ఫొటోని అభిమానులకు షేర్ చేసింది. కాగా ఈ ఫొటోలో కీర్తి చక్కని చీరకట్టు, బొట్టుతో మెరిసిపోతూ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ సినిమా ఆగస్టు 12వ తేదీన విడుదలకు రెడీ అవుతోంది.