క‌ల‌ర్‌ఫుల్‌గా ‘GBN కౌండిన్యోత్స‌వం – బిజినెస్ ఫెస్ట్’

▪️ క‌న్నుల‌ పండ‌వ‌గా తొలి వ‌సంత వేడుక‌లు
▪️ ఎల్ల‌మ్మ ఆల‌యంలో బోనాలు, కౌండిన్యోత్స‌వంలో సంస్కృతిక కార్య‌క్ర‌మాలు
▪️ ఆక‌ట్టుకున్న జీబీఎన్ కుటుంబ స‌భ్యుల నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌లు
▪️ జీబీఎన్ వెబ్‌సైట్ ప్రారంభం
▪️ వివిధ రంగాల్లో సేవ‌లు అందించిన వారికి స‌త్కారం
▪️ ఆర్థిక విప్లవాన్ని సృష్టిస్తూ ముందుకు సాగుతున్న జీబీఎన్

హైద‌రాబాద్: వ్యాపార సామ్రాజ్యంలో ఉన్న‌త‌మైన అడుగులు వేస్తున్న‌ ‘గౌడ్స్ బిజినెస్ నెట్‌వ‌ర్క్ – GBN’ తమ తొలి వార్షికోత్స‌వాన్ని ఘ‌నంగా జ‌రుపుకుంది. ‘జీబీఎన్ కౌండిన్యోత్స‌వం – బిజినెస్ ఫెస్ట్’ పేరిట జ‌రిగిన ఈ వేడుక‌లో వివిధ రంగాల‌లో సేవ‌లు అందించిన వారిని ఆహ్వానించి జీబీఎన్ స‌భ్యులు స‌త్కారించారు. ఉద‌యం బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ ఆల‌యంలో బోనాలు తీసిన జీబీఎన్ స‌భ్యులు.. సాయంత్రం నాగోల్‌లోని సంస్కృతి వరల్డ్ స్కూల్ లో ‘కౌండిన్యోత్సవం – బిజినెస్ ఫెస్ట్’ను సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మాల్లో జీబీఎన్ మెంబ‌ర్స్ కుటుంబ స‌భ్యుల‌తో స‌హ పాల్గొని ఉత్సాహ‌భ‌రితంగా ఆడిపాడారు. జీబీఎన్ కుటుంబ స‌భ్యులు వారి పిల్ల‌లు చేసిన క‌ళా నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌లు ఆహుతుల‌ను అల‌రించాయి. జీబీఎన్ సంవ‌త్స‌ర‌ జ‌ర్నీని, నిర్వ‌హ‌ణ విధానాన్ని తెలుపుతూ ప్ర‌ద‌ర్శించిన ప్ర‌త్యేక వీడియో అంద‌రిని ఆక‌ట్టుకుంది. ఈ వీడియోకు అద్భుత‌మైన గాత్రం అందించిన‌ వేముల రాజేష్ గౌడ్‌కు జీబీఎన్ అధ్య‌క్షుడు చీక‌టి ప్ర‌భాక‌ర్ గౌడ్ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా జీబీఎన్ అధ్య‌క్షుడు చీక‌టి ప్ర‌భాక‌ర్ గౌడ్.. త‌మ‌ బిజినెస్ నెట్‌వ‌ర్క్ ఉద్దేశాల‌ను, ల‌క్ష్యాల‌ను తెలిపారు. ఏడాది క్రితం జీబీఎన్ – ‘ఆచార్య చాప్ట‌ర్‌’ను ప్రారంభించుకుని విజ‌య‌వంతంగా సాగుతున్న ప్ర‌గ‌తిని వివ‌రించారు. తొలి ఏడాదిలోనే ‘జీబీఎన్ చాణక్య’ పేరుతో హైదరాబాద్ ఈస్ట్ జోన్‌లో 2వ‌ చాప్టర్ ప్రారంభించుకున్నామ‌ని, త్వరలోనే నగరం నలుమూలల విస్తరింపజేస్తూ, ప్రతి జిల్లా కేంద్రంలో జీబీఎన్ చాఫ్టర్లు ప్రారంభించుకోబోతున్నామ‌ని చెప్పారు. ఏడాది కాలంలోనే జీబీఎన్ స‌భ్యుల మ‌ధ్య‌ రూ. 10 కోట్ల‌కు పైగా వ్యాపార లావాదేవీల జ‌ర‌గ‌డం విజ‌యానికి ప్ర‌తీక అని జీబీఎన్ గ్రోత్ అంబాసిడ‌ర్ ర‌విగారి ప్ర‌సాద్ గౌడ్ (ఈత‌ముల్లు) అన్నారు.

ఈ వేడుక‌లో పాల్గొన్న అతిథులు జీబీఎన్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. రాజ‌కీయాల‌కు అతీతంగా ప్ర‌పంచంలోనే తొలిసారిగా గౌడ వ్యాపార వేదిక‌ను విజ‌య‌వంతంగా కొన‌సాగిస్తున్నార‌ని జీబీఎన్ స‌భ్యుల‌ను ఈ సంద‌ర్భంగా అభినందించారు. గౌడులు కార్పోరేట్ స్థాయిలో క్ర‌మశిక్ష‌ణ‌గా నిర్వ‌హించుకుంటున్న జీబీఎన్ స‌మావేశాల తీరుపై ప్ర‌శంస‌లు కురిపించారు. గౌడ్స్ వ్యాపారుల ఆర్థిక విప్లవాన్ని సృష్టించడమే ప్రధాన లక్ష్యంగా సాగుతున్న బిజినెస్ నెట్‌వ‌ర్క్ మ‌రింతా ముందుకు సాగాల‌ని ఆకాంక్షించారు.

క‌న్నుల‌ పండ‌వ‌గా సాగిన ఈ వేడుక‌లో తెలంగాణ రాష్ట్ర‌ కల్లు గీత కార్పొరేషన్ తొలి చైర్మన్ ప‌ల్లె ర‌వికుమార్ గౌడ్, గౌడ సంఘాల‌ సీనియ‌ర్ నాయ‌కులు చింత‌ల మ‌ల్లేశం, చ‌రిత్ర ప‌రిశోధ‌క ర‌చ‌యిత కొంప‌ల్లి వెంక‌ట్ గౌడ్, తెలంగాణ ఉద్య‌మ‌కారుడు కోట శ్రీ‌నివాస్ గౌడ్, గౌడ జ‌న హ‌క్కుల పోరాట స‌మితి అధ్య‌క్షుడు ఎలిక‌ట్టే విజ‌య‌కుమార్, గౌడ ఐక్య సాధ‌న స‌మితి అధ్య‌క్షుడు అంబాల నారాయ‌ణ గౌడ్, ‘బ‌ల‌గం’ సినిమా ఫేం సంజ‌య్ గౌడ్, సుప్ర‌జ హ‌స్పిట‌ల్ చైర్మెన్ అంబ‌టి శ్రీ‌నివాస్ గౌడ్, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు వేముల రాజేష్ గౌడ్ త‌దిత‌రులు పాల్గొని జీబీఎన్ స‌భ్యుల‌కు తొలి వార్షికోత్స‌వ‌ శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో GBN ప్రెసిడెంట్ చీక‌టి ప్రభాకర్, గ్రోత్ అంబాసిడ‌ర్ రవిగారి ప్రసాద్ గౌడ్ (ఈతముల్లు), GBN చాణక్య చాప్టర్ ప్రెసిడెంట్ డా.మొలుగూరి గిరిధర్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ సి. శివకుమార్ గౌడ్, సెక్ర‌ట‌రీ దేశిని గణేష్ గౌడ్, ముద్దగోని అమర్నాథ్ గౌడ్, లక్ష్మీనారాయణ ర్యాకల, స్వామి ముద్దం, జి నరసింహారావు గౌడ్, డా. కొయ్యది వేణు, మట్ట రాజు గౌడ్, వడ్లకొండ ప్రేమలత గౌడ్, ఆములకొండ శ్రీనివాసరావు గౌడ్, మలుగారి శేఖర్ గౌడ్, ఇందిరా ప్రియ దర్శిని, మట్టపల్లి నాగరాజు, పల్లె సాయి చరణ్ గౌడ్, చండి శ్రీనివాస్ గౌడ్, తాండ సంతోష్ కుమార్ గౌడ్, బి.నర్సిహ్మ గౌడ్, చలమల శ్రీనివాసులు గౌడ్, కిషోర్ సారా, కందూరి యుగంధర్ గౌడ్, ఎస్. అరవింద్ గౌడ్, GBN చాణక్య చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ దివ్యగౌడ్ కె, బుర్ర శ్రీనివాస్ గౌడ్, ఇ. శ్రీనివాస్ గౌడ్, మేడారం రాకేష్ గౌడ్, ఇ.రాఘవేంద్ర గౌడ్, సంధగళ్ల మధుసూధన్ గౌడ్, అందె మంజుల, నత్తి రాజేందర్ గౌడ్, ఎం. రమేష్ గౌడ్, ఎం. రామకృష్ణ గౌడ్, బి.పద్మ గౌడ్, గుండ్ల ఆంజనేయులు, మిమిక్రీ సత్యనారాయ‌ణ గౌడ్, శ్రీమంతుల ప్రగతి, కె.సత్యనారాయణ గౌడ్, ఎం నరేష్ గౌడ్, టి నాగరాజు గౌడ్, యెరుకల శారద, గండం సురేష్ కుటుంబ స‌భ్యుల‌తో స‌హా పాల్గొని ఈవెంట్ ఘ‌నంగా జ‌ర‌ప‌డంలో భాగ‌స్వాములయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *