రాజీనామాకు రెడీ… కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం…

తెలంగాణ మాజీ ఆరోగ్యశాఖామంత్రి ఈటల రవీందర్ డైరెక్ట్ గా ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ పై అటాక్ కు దిగారు. తాను చావునైనా భరిస్తాను గానీ, ఆత్మగౌరవాన్ని చంపుకోనని స్పష్టం చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ సిఎం కెసిఆర్, ఆయన కేబినెట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు రెడీ అంటూ ప్రకటించారు. తాను తన నియోజకవర్గ ప్రజల దగ్గర వెళ్లి, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని ఓ నిర్ణయం తీసుకుంటానని.. ఈటెల పదవుల కోసం పెదవులు మూసే వ్యక్తి కాదని అన్నారు.
అదేవిధంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ మానవ సంబంధాలు శాశ్వతమని.. ఎన్ని రోజులు జెల్లో పెడతావు.. అసెంబ్లీలో పేగులు బయట పడేలా తెలంగాణ కోసం కొట్టాడానని గుర్తు చేసుకున్నారు. తన ఆస్తులపై నిజాయితీగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని.. తాను చేసే పని ఆత్మగౌరవ సమస్య అని స్పష్టం చేశారు. తాను చెడు పని చేసి దూరం కాలేదని… మమ్ములను మంత్రులుగా కాకున్నా మనుషులుగా చూడండి అంటూ ఆయన వాపోయారు. అంతేకాకుండా మీవద్ద ఉన్న ఏ ఒక్క మంత్రి ఆత్మ గౌరవంతో లేరని.. చట్టాన్ని, సిస్టమ్ ను పక్కన పెట్టి పని చేస్తున్నారని చురకలు అంటించారు. నిజంగా తాను చావును అయినా బరిస్తాను కానీ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టబోనని తెలిపారు. కేసీఆర్ ఏవిధంగా పగ బడతారో అందరికీ తెలుసని… ఒకసారి కేసీఆర్ తలుసుకుంటే అవతల వ్యక్తి పరిస్థితి ఏంటి అనేది తనకు బాగా తెలుసని కూడా ఆయన వివరించారు. తన కార్యకర్తలు ఆవేశానికి లోనై ఏమి చేయొద్దని సంయమనం పాటించాలని చేతులెత్తి చెప్పారు. రాజీనామాపై త్వరలో నిర్ణయాన్ని ప్రకటిస్తానని కూడా ఈటల రాజేందర్ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *