బెంగాల్ లో బీజేపీ ఓటమిపై వర్మ మార్క్ సెటైర్……
పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో మమతా బెనర్జీ హ్యాట్రిక్ కొట్టింది. తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మొత్తం 292 నియోజక వర్గాలకు ఎన్నికలు నిర్వహించగా.. ఏకంగా 213 సీట్లను మమతా బెనర్జీ కైవసం చేసుకుంది. 77 సీట్లతో బీజేపీ రెండో స్థానంలో నిలవడం అంటే మోడీ, అమిత్ షా చతికిల పడటం వంటిదే అని చెప్పవచ్చు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని తీవ్రంగా ప్రచారాన్ని హోరెత్తించారు. ఈ సమయంలో మమతా.. ‘ఈ విజయం బెంగాలీ ప్రజల కోసం.. ఇది బెంగాలీల విజయం’ అంటూ ప్రకటించారు. టీఎంసీ ఘన విజయం సాధించినా.. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి విజయోత్సవాలు నిర్వహించొద్దని పార్టీ శ్రేణులను ఆమె ఆదేశించడం విశేషం.
ఇదే సమయంలో టాలీవుడ్ సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ పరాజయం పాలు కావడంపై సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. ‘దీదీ ఓ దీదీ.. ఫిల్మ్.. మమతా, మోడీ.. అమిత్’ అంటూ ఓ క్యాప్షన్ ఇచ్చి వీడియో పోస్ట్ చేశారు.
కాగా వర్మ పోస్ట్ చేసిన వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా ఈ వీడియోను చూసిన బీజేపీ నాయకులు మాత్రం వర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కామెడీ వీడియోని వర్మ గత సినిమాలతో పోలుస్తూ పోస్ట్ చేస్తుండటం విశేషం. మొత్తానికి బెంగాల్ లో మమతా విజయం నెట్టింట్లో వర్మ హాస్యంతో నెటిజన్లు ఎంజాయ్ చేస్తున్నారు.