హైటెక్ సిటీ రైల్వే అండర్ పాస్ ను ప్రారంభించిన కేటీఆర్
హైదరాబాద్ లో మరో అద్భుతాన్ని ప్రారంభించారు మంత్రి కేటీఆర్. హైటెక్ సిటీ రైల్వే అండర్ పాస్ ను మంత్రి కేటీఆర్ ఈరోజు ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మేయర్, డిప్యూటీ మేయర్లు పాల్గొన్నారు. మొత్తం రూ. 66.59 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ తో హైటెక్ సిటీ, ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోనున్నాయి.
అదేవిధంగా అంతకుముందు మూసాపేట్ సర్కిల్లోని అంబేద్కర్ నగర్ నుంచి డంపింగ్ యార్డ్ వరకు రూ. 99 లక్షల వ్యయంతో నిర్మించేందుకు తగిన వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులను కూడా మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. విలీనమైన నగర శివారు మున్సిపాలిటీల్లో రూ.3500 కోట్ల వ్యయంతో సమగ్ర డ్రైనేజి పునర్నిణ పనులు చేపడతామని.. గత టర్మ్ లో రూ. 3000 కోట్లతో తాగు నీరు అందించే పనులను విజయవంతంగా చేపట్టామని అన్నారు. ఇంకా కైతలపూర్ లో డంపింగ్ యార్డ్ సమస్య ఉందని.. ఇక్కడి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆధునికరణ ట్రాన్స్ ఫర్ పాయింట్ ను ఆధునీకరిస్తామని హామీ కూడా ఇచ్చారు. కాగా వర్షా కాలంలో ఇండ్లలోకి నీరు రాకుండా చర్యలు తీసుకుంటామని.. డ్రైనేజి సిస్టమ్ ను కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్ వివరించారు.