ఈ ఎంపీలకు మోడీని చూస్తే భయం : ఉండవల్లి

ఆంధ్రప్రదేశ్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రతరం అవుతోంది. ఈనెల 26వ తేదీన వామపక్షాలు, కేంద్ర కార్మిక సంఘాల తలపెట్టిన భారత్ బంద్కు మద్దతు ప్రకటించారు సీనియర్ పొలిటీషన్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ఈరోజు రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఉండవల్లి ఈనెల 26న భారత్ బంద్ కు తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. అయితే భారత్ బంద్ విజయవంతమైతే ప్రధాని నరేంద్ర మోడీ.. తన విధానాలపై వెనక్కి తగ్గే అవకాశం ఉందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ అనుసరిస్తున్న క్యాపిటలిస్ట్ విధానాలపై భారతీయ జనతా పార్టీలోనే మద్దతు లేదని తెలిపిన ఆయన పార్లమెంటులో పారిశ్రామికవేత్తలు ఎక్కువ మంది ఎంపీలుగా ఉండటం వల్ల ప్రధాని నరేంద్ర మోడీకి భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.
అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రధాని అయ్యే నాటికి రూ.46 లక్షల కోట్ల అప్పు ఉంటే.. ఇప్పుడు అది రూ. కోటి 7 లక్షల కోట్లకు చేరిందని అన్నారు. అదేవిధంగా విశాఖలో జరిగిన సభతో స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఇంకా ఉధృతంగా ఉందన్న విషయం తెలిసిందని, స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కలిసి పోరాటం చేయాలని ఉండవల్లి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *