వైఎస్ జగన్ ను కలుస్తా : జేసీ బ్రదర్

ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ఉత్కంఠకు దారితీసిన మున్సిపాలిటీ తాడిపత్రి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీకికి సమాన స్థాయిలో కౌన్సిలర్లు రావడంతో రాష్ట్రంలోని అందరి దృష్టిని ఆ మున్సిపాలిటీ ఆకర్షించింది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది. టీడీపీకి బలం ఉన్నప్పటికీ.. అధికార వైసీపీ ఎక్కడ మున్సిప్ ఛైర్మన్ ఎగరేసుకుపోతుందోననే ఉత్కంఠ కొనసాగింది. ఆ ఉత్కంఠకు తెరదించుతూ.. మున్సిపల్ ఛైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ కౌన్సిలర్ జేసీ ప్రభాకర్రెడ్డి ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్గా సరస్వతిని ఎన్నుకున్నారు.
అయితే టీడీపీకి ఉన్న 18 మంది కౌన్సిలర్ల బలానికి తోడు సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు మద్దతు ఇవ్వడంతో ప్రభాకర్రెడ్డి ఛైర్మన్ పీఠం దక్కించుకోగలిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జేసీ ప్రభాకర్రెడ్డి సంచలన వ్యాఖ్యలే చేశారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అవసరమైతే సీఎం వైఎస్ జగన్ను కలుస్తానని తెలిపారు. అలాగే సేవ్ తాడిపత్రి నినాదంతో ముందుకు వెళ్తామని, తాడిపత్రి మున్సిపాలిటీని నెంబర్ వన్ చేసి చూపిస్తానని వివరించారు. ఈ ఎన్నికల్లో తనకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇంకా జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అవేమంటే సీఎం వైఎస్ జగన్ నైతిక విలువలు కలిగిన మనిషి అని, ఆయన సహకారం లేకపోతే తాను ఛైర్మన్ అయ్యేవాడిని కాదని ఒప్పే అంటూ ఒప్పేసుకున్నారు. ఇప్పుడు ఈ చర్చ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది. సీఎం జగన్పై ఇలా ప్రశంసలు కురిపించిన జేసీ.. అవసరం అయితే సీఎం జగన్ను కలుస్తానడం రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు అనే నానుడిని నిజం చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *