చంద్రబాబుకు షాక్… ఏపీ సీఐడీ నోటీసులు
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు ముందు ఒక లెక్క ఆ తర్వాత ఒక లెక్క అనట్టుగా మారిపోతున్నాయి రాజకీయాలు. తాజాగా ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబుకి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. అందుకు సంబంధించి హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు సీఐడీ అధికారులు. అంతేకాకుండా రెండు బృందాలుగా సీఐడీ అధికారులు హైదరాబాద్ వెళ్లినట్లు సమాచారం అందుతుంది.
అయితే అమరావతి రాజధానిలో భూముల కొనుగోలు, అమ్మకాల వేషయంలో చంద్రబాబుపై కేసు నమోదు చేశారు సీఐడీ అధికారులు. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారులు నోటీసులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణకూ సీఐడీ నోటీసులు జారీ చేసింది. 41సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చినట్లు సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తెలిపారు. కాగా ఇందుకు సంబంధించి చంద్రబాబు ఎలా స్పందిస్తారు అన్నది టీడీపీ తమ్ముళ్లకు ఉత్కంఠగా మారింది.