సువర్ణ అవకాశం: మళ్లీ తగ్గిన పసిడి ధర…
ఈ మధ్య బంగారం ధర కాస్త తగ్గుతూ వస్తుంది. తాజాగా మరోసారి పసిడి ధర కిందకు దిగివచ్చింది. వరుసగా రెండు రోజులు కాస్త పైకి కదిలిన బంగారం ధర.. ఈరోజు మళ్లీ కిందకు దిగింది.
అయితే హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 తగ్గడంతో రూ.45,440కు దిగివచ్చింది. అయితే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 తగ్గి రూ.41,650కి పరిమితమైంది. అదేవిధంగా వెండి ధర మాత్రం కాస్త పెరిగింది. రూ. 100 పెరిగి రూ.71,100కు చేరింది కిలో వెండి ధర. అలాగే అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ధర తగ్గడం విశేషం. బంగారం ధర ఔన్స్కు 0.13 శాతం తగ్గడంతో 1714 డాలర్లకు క్షీణించింది. వెండి ధర ఔన్స్కు 0.53 శాతం క్షీణించడంతో 26.04 డాలర్లకు దిగి రావడం విశేషం.