ఉద్యోగులకు కరోనా టీకా ఫ్రీ : రిలయన్స్
దేశంలో కరోనా తిరిగి విస్తరిస్తున్న సమయంలో టీకా అందుబాటులోకి రావడం అదృష్టంగానే భావించాలి. అయితే దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే మహారాష్ట్రలో కరోనా సెకండె వేవ్ చాలా తీవ్రంగా విస్తరిస్తుంది. ఈ సమయంలో రిలయమ్స్ సంస్థ ఓ సంతోషకరమైన వార్త వెల్లడించింది.
ప్రదాని నరేంద్ర మోడీ డైరెక్షన్ లో దేశంలో వేగవంతంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే దేశంలో సుమారు 1.80 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ ను వేయించుకున్నారు. మార్చి 1వ తేదీ నుంచి 60 సంవత్సరాలు దాటిన వారికి కూడా కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వ్యాక్సిన్ అందిస్తుండటంతో రిలయన్స్ సంస్థ ఓ కీలక ప్రకటణ చేసింది. తమ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ, అలాగే వారి కుటుంబసభ్యులకు ఉచితంగా టీకాను అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా మొత్తం 19లక్షల మందికి వ్యాక్సిన్ అందించేందుకు రిలయన్స్ సంస్థ ముందుకు రావడం విశేషంగా చెప్పవచ్చు. ఈ వ్యాక్సిన్ ఖర్చు మొత్తాన్ని రిలయన్స్ సంస్థ భరించనుంది.