ఘ‌నంగా అగ్ని సోలార్ 11వ వార్షికోత్సవ వేడుకలు

హైదరాబాద్: పునరుత్పాదక ఇంధన రంగంలో అగ్రగామిగా ఉన్న అగ్ని సోలార్ 11వ వార్షికోత్సవ వేడుకలు సికింద్రాబాద్‌లోని మినర్వా గ్రాండ్ హోటల్‌లో ఘ‌నంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీజిఎంఎస్ రిటైర్డ్ డైరెక్టర్ జీ. ప్రసాదరావుతో సహా, గౌర‌వ అతిథులుగా రీఎనర్జీ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఏవీఎల్ రావు, బీవీ రాజు ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈఈఈ విభాగం ప్రొఫెసర్ ఎన్ రాంచందర్ పాల్గొని అగ్ని సోలార్ నిర్వ‌హ‌కులకు శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఉత్సాహంగా సాగిన అగ్ని సోలార్ వార్షికోత్స‌వ వేడుక‌ల్లో అగ్ని సోలార్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసన్నేశ్వర్ రావు మాట్లాడుతూ.. గత 11 సంవత్సరాలుగా తమ ప్ర‌యాణంలో స‌హ‌క‌రించిన‌ ఉద్యోగులు, భాగస్వాములు, వాటాదారులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సంస్థను విజయపథంలో నడిపించడంలో ప్రతి వ్యక్తి పోషించే కీలక పాత్రను చెబుతూ, ఎక్సలెన్స్, ఇన్నోవేషన్, సస్టెయినబిలిటీల పట్ల అగ్ని సోలార్ నిబద్ధతను ఆయ‌న తెలిపారు.

ఈ సంద‌ర్భంగా అగ్ని సోలార్ మేనేజ్‌మెంట్ తమ విజన్ 2029 ప్రణాళికను ఆవిష్కరిస్తూ అందులో భాగంగా 2028-29 ఆర్థిక సంవత్సరం నాటికి 1000 కోట్ల ఆదాయ మైలురాయిని సాధించాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని కూడా ప్ర‌క‌టించారు. రాబోయే ఐదేళ్లలో స్థిరమైన వృద్ధి పట్ల అగ్ని సోలార్ నిబద్ధతను నిర్వ‌హ‌కులు తెలిపారు. పునరుత్పాదక శక్తితో నడిచే ప్రకాశవంతమైన, స్వచ్ఛమైన భవిష్యత్తును రూపొందించడంలో సంస్థ అచంచలమైన అంకితభావాన్ని పునరుద్ఘాటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *