బీఎస్పీలోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్…
తెలంగాణ నుంచి వీఆర్ఎస్ తీసుకున్న ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్… రాజకీయాల వైపు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఆయన వీఆర్ఎస్ తీసుకన్న తర్వాత.. టీఆర్ఎస్లో చేరతారని.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని విపరీతమైన ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలను ఆయనే స్వయంగా ఖండించారు. ఆ తర్వాత ఆర్ఎస్పీ.. బీఎస్పీవైపు అడుగులు వేస్తున్నారని.. ఆ పార్టీలో చేరి.. తెలంగాణలో బీఎస్పీని బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టనున్నారనే చర్చ కూడా నడిచింది. ఆ వార్తలను నిజమేనని ఇప్పుడు స్పష్టమైంది. తాజాగా మీడియాతోమాట్లాడిన బీఎస్పీ అధినేత్రి మాయావతి.. కాన్షీరాం అడుగుజాడల్లో నడిచేందుకు తెలంగాణకు చెందిన మాజీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్.. బీఎస్పీలో చేరేందుకు రెడీ అవుతున్నారని.. త్వరలోనే ఆయన పార్టీలో చేరతారని వెల్లడించారు.
అదేవిధంగా మాయావతి ప్రకటనతో బీఎస్పీలో చేరేందుకు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు గ్నీన్ సిగ్నల్ వచ్చినట్లు అయింది. అలాగే బహుజన సమాజ్ పార్టీలో చేరేందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసక్తిగా ఉన్నట్లు అప్పటి నుంచి టాక్ నడుస్తోంది. గత నెలలో ఆయన యూపీకి వెళ్లి బీఎస్సీ అధినేత్రి మాయావతితో భేటీ అయ్యారు. అప్పటికే జై భీమ్… జై భారత్ నినాదంతో ఉన్న ఆయన పలు సందర్భాల్లో బహుజనవాదం కూడా వినిపించారు. బీఎస్పీలో చేరుతారనే ప్రచారం జరగగా… మాయావతి తాజాగా చేసిన ప్రకటనతో అది నిజమని తేలింది. కాగా వంద శాతం పేదల పక్షాన ఉండాలనుకుంటున్నానని.. అందుకే వీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నానని.. ఐపీఎస్ అధికారిగా వివిధ హోదాల్లో 26 ఏండ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించానని తాజాగా ఆయన వివరించారు. అంతేకాకుండా తాను అనేక శాఖల్లో పని చేశానని.. ఇంకా ఆరేండ్ల సర్వీసు ఉందని.. తన సర్వీసులో కేవలం ఒక్క శాతం మాత్రమే పేదలకు సేవలందించానని.. వందశాతం పేదల పక్షాన ఉండాలనే రాజీనామా చేస్తున్నట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే.