అంతరిక్ష యాత్రకు జెఫ్ బెజోస్…..
అంతరిక్ష యాత్రకు అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ రెడీ కాబోతున్నారు. భారత కాలమానం ప్రకారం ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు జెఫ్ బెజోస్ ఆయన తమ్ముడు, మరో నలుగురితో కలిసి అంతరిక్షయానం చేయనున్నారు. తన అంతరిక్ష సంస్థ బ్లూఆరిజిన్ తయారు చేసిన న్యూషెపర్డ్ స్పేస్ షటిల్ ద్వారా ఈ బృందం అంతరిక్షంలోకి వెళ్లనుంది. అయితే భూమి నుంచి 100 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి కర్మన్ రేఖను దాటి అక్కడి నుంచి తిరిగి భూమికి చేరుకుంటారు. అలాగే ఈ న్యూషెపర్డ్ లో జెఫ్ బెజోస్, ఆయన సోదరుడు మార్క్, 82 ఏళ్ల మాజీ మహిళా ఫైలట్ వాలీఫంక్, 18 ఏళ్ల అలివర్ డేమెన్ లు రోదసియాత్ర చేయనున్నట్లు వెల్లడౌతుంది.
కాగా కొన్ని రోజుల క్రితం వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ యాత్రను చేసిన విషయం తెలిసిందే. న్యూషెపర్డ్ స్పెస్ షటిల్ పూర్తిగా ఆటోమెటిక్గా పనిచేస్తుంది. అంతేకాకుండా దీని మోత్తం కంట్రోల్ భూమిమీద నుంచే ఉంటుంది. పైలెట్లు లేకుండా జరుగుతున్న యాత్ర కావడంతో అందరిదృష్టి ఈ యాత్పైనే ఉంది. పశ్చిమ టెక్సాస్ ఎడారి నుంచి ఈ రాకెట్ అంతరిక్షంలోకి దూసుకుపోనుండటం విశేషంగా చెప్పవచ్చు.