జలపాతం క్రింద వేలమంది జలకాలాట.. మండిపడ్డ నెటిజన్లు

కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గినా ఇంకా అదుపులోకి రాలేదు. కేసులు తగ్గుముఖం పడుతుండటంతో అన్ని రంగాలకు అనుమతులు ఇచ్చారు. అయితే దేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలు తిరిగి తెరుచుకోవడంతో టూరిస్టుల తాకిడి విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని పర్యాటక ప్రదేశాలకు టూరిస్టులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాఖండ్లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన ముస్సోరిలోని కెంప్టీ జలపాతాన్ని సందర్శించేందుకు పర్యాటకులు భారీగా తరలి వచ్చారు. కెంప్టీ జలపాతం కింద పర్యాటకులు పోటీలుపడి మరీ స్నానాలు చేయడం కలకలం రేపింది.
అదేవిధంగా వేలాదలాది మంది మాస్కులు లేకుండా, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా జలపాతం కిందకు చేరారు. జలకాలాడారు. దీనిపై నెట్టింట్లో పెద్ద దిమారమే రేగింది. సాధారణ వేలల్లో అయితే నెటిజన్లు అంతగా రియాక్ట్ అయ్యేవారు కాదు. కానీ.. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోన్నామో అందరికి తెలుసు. దీనిపై నెటిజన్లు చాలా తీవ్రంగా స్పందించారు. కరోనా నిబంధనలు గాలికి వదిలేయడం మంచిదికాదని, కరోనా థర్డ్ వేవ్ ముప్పు ప్రమాదం దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు. ఎంప్టీ బ్రెయిన్స్ ఎట్ కెంప్టీ అంటూ కామెంట్లు పేలుస్తున్నారు. కాగా కెంప్టీ జలపాతానికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండటం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *