సల్మాన్ ప్రాజెక్ట్ లోకి హృతిక్ ఎంట్రీ…!
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ 2019లోనే తన డ్రీం ప్రాజెక్ట్ అయిన ‘ఇన్షల్లా’ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రాజెక్టుతో ఒక్కసారిగా భన్సాలీ సంచలనం సృష్టించారు. అంతేకాకుండా ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, అలియా భట్ జంటగా నటించనున్నారని కూడా ఆ మధ్య టాక్ నడిచింది. అయితే చిత్రనిర్మాత, సల్మాన్ ఖాన్ కు మధ్య వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. తాజాగా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ను మళ్ళీ పట్టాలెక్కించేందుకు భన్సాలీ తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా సల్మాన్ ప్లేస్ లో హృతిక్ రోషన్ తో సినిమా చేయాలని.. ఈ హీరో సరసన అలియా భట్ నటించబోతున్నారని సమాచారం అందుతుంది.
అంతేకాకుండా తాజాగా వస్తున్న విషయాలను బట్టి చూస్తే… భన్సాలీ ప్రస్తుతం ‘హీరా మండి’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. అలాగే ‘గంగూబాయి కతియావాడి’ని పూర్తి చేసి ‘ఇన్షల్లా’పై కూడా దృష్టి సారించినట్లు సమాచారం అందుతుంది. ఇప్పటికే హృతిక్ కు స్టోరీని చెప్పగా… ఆయనకు బాగా నచ్చిందని… కానీ.. స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయమని హృతిక్ కోరినట్లు తెలుస్తోంది. దీంతో భన్సాలీ స్క్రిప్ట్‌పై రీ వర్క్ చేస్తున్నారని కూడా సమాచారం అందుతుంది. అన్నీ సరిగ్గా జరిగితే 2022 ద్వితీయార్ధంలో ‘ఇన్షల్లా’ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందనే టాక్ కూడా నడుస్తోంది. కాగా ప్రస్తుతానికి భన్సాలీ, అలియా భట్ ‘గంగూబాయి కతియావాడి’ విడుదల చేసే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. అదేవిధంగా హృతిక్ కూడా ‘విక్రమ్ వేదా’ హిందీ రీమేక్, ‘ఫైటర్’ సినిమాల్లో నటిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేసిన తర్వాత ‘ఇన్షల్లా’ ప్రారంభం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాగా ఇదే నిజమైతే 2010లో వచ్చిన ‘గుజారీష్’ తర్వాత భన్సాలీ, హృతిక్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది. మొత్తానికి సల్మాన్ ప్రాజెక్టును హృతిక్ అందుకున్నారన్నమాట.