ఆగష్టు 16నుంచి ఏపీలో స్కూల్స్ రీఓపన్…!

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ఈరోజు విద్యారంగంలో నాడు- నేడు, విద్యాకానుకలపై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. నూతన విద్యావిధానం అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. అలాగే ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఈనెల 12 నుంచి ఆన్ లైన్ తరగతులు ప్రారంభించాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆగస్టులోపు విద్యా సంస్థల్లో నాడు-నేడు పెండింగ్ పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారని అన్నారు. జులై 15 నుంచి ఆగస్టు 15 వరకు వర్క్ బుక్కులపై ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం ఉంటుందని వివరించారు.
అదేవిధంగా పాఠశాలలు పునః ప్రారంభం అంటే.. ఆగస్టు15వ తేదీలోపు పాఠశాల పనులు పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించినట్లు విద్యాశాఖ మంత్రి అన్నారు. పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా సీఎం చర్యలు తీసుకుంటున్నారని.. ప్రభుత్వం నూతన విద్యా విధానం తప్పనిసరిగా అమలు చేస్తుందని తెలిపారు. అంతేకాకుండా నూతన విద్యా విధానం అమలు వల్ల ఏ స్కూల్ మూతపడదని.. ఏ ఉపాధ్యాయుడు పోస్టు తగ్గదని.. రాబోయే రెండేళ్లలో ఫౌండేషన్ స్కూళ్లకు అదనపు గదులు నిర్మాణం పూర్తిచేస్తామని కూడా స్పష్టం చేశారు. కాగా నాడు-నేడు కింద పనుల కోసం రూ.16 వేల కోట్లతో బడ్జెట్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారని.. 30 శాతం పదో తరగతి, 70 శాతం ఇంటర్ ప్రథమ సంవత్సరం మార్కులు ప్రాతిపదికగా ఇంటర్ విద్యార్థులకు మార్కుల కేటాయిస్తామని స్పష్టం చేశారు. అయితే ఈ నెలాఖరులోపు ఇంటర్ విద్యార్థులకు మార్కుల మెమోలు జారీ చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *