న్యూయార్క్ లో రెస్టారెంట్ ఓపన్ చేసిన ప్రియాంక చోప్రా…

బాలీవుడ్ స్టార్ హీరోయిన్, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన నిక్ జోనస్ తో కలిసి న్యూయార్క్ నగరంలో నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. అయితే హాలీవుడ్ లో తన తొలి టీవీ షో ‘క్వాంటికో’ ద్వారా వార్తల్లో నిలిచిన ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు పలు వరుస ప్రాజెక్టులతో చాలా బిజీ అయిపోయారు. పాప్ స్టార్ నిక్ జోనస్ ను వివాహం చేసుకున్న తర్వాత ఈ భామామణి యూఎస్ లో అత్యంత ఖరీదైన బంగ్లా కొని సంచలనం సృష్టించింది. తర్వాత కూడ ఈ బ్యూటీ మరిన్ని వ్యాపారాలు కూడా చేసేందుకు రెడీ అయింది. తాజాగా న్యూయార్క్ లో ఇండియన్ రెస్టారెంట్ ను ఓపెన్ చేసింది.
అయితే ప్రియాంక చోప్రా ఈ రెస్టారెంట్ కు ‘సోనా’ అనే పేరును పెట్టింది. రెస్టారెంట్ ను ప్రారంభించిన విషయాన్ని ప్రియాంక తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. అందులో ఈ ముద్దుగుమ్మ ఏమని చెప్తుందంటే.. ‘3 సంవత్సరాల ప్రణాళిక, శ్రమ తర్వాత ఫలించింది’ అంటూ పిక్స్ ను షేర్ చేసింది. ఈ పిక్స్ చూస్తుంటే… రెస్టారెంట్ మొత్తం ఇండియన్ ఇంటీరియర్ డిజైన్ తో రూపొందించినట్లు అట్టే తెలిసిపోతుంది. కాగా ఇదే పిక్స్ లో ప్రియాంక తన స్నేహితురాళ్ళతో కలిసి పానీపూరి తింటూ కన్పించారు. ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ మారడం విశేషం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *