ఆ హీరోయిన్లతో కలిసి అక్షయ్ సినిమా…!

బాలీవుడ్ ఖిలాడీ హీరో అక్షయ్ కుమార్ తాజాగా ముగ్గురు బాలీవుడ్ భామలతో కలిసి సినిమా చూశారు. అందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి. “బెల్ బాటమ్” థియేట్రికల్ విడుదలకు ముందు సినిమా నిర్మాతలు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనను హీరోయిన్స్ అయిన వాణి కపూర్, హుమా ఖురేషి, లారా దత్తాతో కలిసి వీక్షించారు. ఈ సినిమా జూలై 27వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ప్రత్యేక స్క్రీనింగ్ పిక్స్ ను హుమా ఖురేషి, వాణీ కపూర్ తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలలో షేర్ చేయడంతో ఆ పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
అయితే అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ “బెల్ బాటమ్”. ఇందులో వాణి కపూర్, హుమా ఖురేషి, లారా దత్తా ప్రధాన పాత్రలను పోషించారు. కాగా అక్షయ్ రా ఏజెంట్ పాత్ర పోషించగా… మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను లారా దత్తా పోషిస్తున్నారు. ఈ సినిమాలో అక్షయ్ భార్యగా వాణి కపూర్ నటించారు. ‘బెల్ బాటమ్’ 80వ దశాబ్దంలో ఇండియాలో అలజడి సృష్టించిన విమానం హైజాక్ ఆధారంగా రూపొందింది. అయితే ఈ సినిమాని రంజిత్ తివారి దర్శకత్వం వహించగా పూజ ఎంటర్టైన్మెంట్స్, ఎమ్మే ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తుండటం విశేషంగా చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *