చర్చల ఫలితం… ఏపీలో సమ్మె విరమించిన జూడాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం-జూనియర్ డాక్టర్ల మధ్య చర్చలు ఫలించాయి. దీంతో.. జూనియర్ డాక్టర్లు సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. అయితే జూడాలతో మంత్రి ఆళ్లనాని, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి చర్చలు జరిపారు. సుదీర్ఘంగా జరిపిన చర్చల్లో వారి డిమాండ్లపై సానుకూలత వ్యక్తం చేశారు. డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో.. సమ్మె విరమిస్తున్నట్టు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు.
అదేవిధంగా తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం హామీ ఇచ్చిందని చర్చల్లో పాల్గొన్న జూడాల ప్రతినిధులు తెలిపారు. అలాగే తమ డిమాండ్ల పరిష్కారం కోసం గతంలో ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చిన జూడాలు.. ఈరోజు నుంచి సమ్మెకు దిగారు. కాగా ఫ్రంట్లైన్ వారియర్లందరికీ ఆరోగ్య బీమా కల్పించాలని, కోవిడ్ ప్రోత్సాహకం ఇవ్వాలని, ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాలు పెంచాలని వారు డిమాండు చేశారు. ప్రభుత్వంతో ఇప్పటికే జూడాలు రెండు సార్లు జరిపిన చర్చలు విఫలం కావడంతో ఈరోజు జరిపిన చర్చలు సఫలం కావడం విశేషం. దీంతో జూడా ప్రతినిధులు సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించడం విశేషంగా చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *