హరిత విప్లవానికి నాంది పలికింది కేసీఆర్ : కేటీఆర్
తెలంగాణలో హరిత విప్లవానికి సీఎం కేసీఆర్ నాంది పలికారు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు మంత్రి కేటీఆర్.. ఈరోజు ఆయన సిరిసిల్లలో పర్యటించి అక్కడ మాట్లాడారు. వ్యవసాయానికి దేశంలో ఏ రాష్ట్రం, ఏ నాయకుడు ఇవ్వని ప్రాధాన్యత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చారని తెలిపారు. అలాగే టిఆర్ఎస్ ప్రభుత్వం కర్షక ప్రభుత్వమని ఆయన ప్రకటించారు. ముఖ్యంగా రైతాంగానికి రైతు బీమ, రైతు బంధు పథకాల ద్వారా ప్రోత్సాహం టిఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిందని… తెలిపిన ఆయన ఈ సంవత్సరం జిల్లాలో 2 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి వస్తుందని అని అంచనా వేస్తే.. మూడు లక్షల 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి వచ్చిందని అన్నారు.
అదేవిధంగా ఎక్కడో ఉన్న కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి కుడెల్లి వాగులో నింపిన ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు. అంతేకాకుండా ఈ సంవత్సరం ప్రతి రైతు బంపర్ దిగుమతి సాధించాడని.. అందుకు కారణం సీఎం కేసీఆర్ రైతుల పట్ల అవలంబిస్తున్న నిర్ణయాలే అన్నారు. సిరిసిల్ల పెద్దురులో 22 కోట్లతో అధునాతమైన వ్యవసాయ మార్కెట్ యార్డ్ పూర్తయిందని.. ఈనెల 11న వ్యవసాయ మంత్రితో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని.. ఈనెల 15వ తారీకు నుంచి రైతులకు, రైతుబంధు డబ్బులు జమ కాబోతున్నాయని ఆయన తెలిపారు. అలాగే ఫారెస్ట్ భూములకు సంబంధించిన వివాదాలు ఉంటే కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాల్సిందిగా కేటీఆర్ కోరడం విశేషం.