చైనా సంచలన నిర్ణయం… ఇద్దరు కాదు.. ముగ్గురు ముద్దు…

ఇప్పుడు ప్రపంచ జనాభాలో నంబర్ వన్గా దూసుకుపోతున్న దేశం చైనా. అయితే ఇప్పుడు చైనా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. జనాభా నియంత్రణకు ఒకప్పుడు ఒక్కరు చాలు ఇద్దరు వద్దు, ఒక్కరు ముద్దు అంటూ కఠిన నిబంధనలు పెట్టింది. ఆ తర్వాత దానిని సవరిస్తూ.. ఇద్దరిని కనవచ్చు అంటూ కొత్త రూల్ తెచ్చింది. మరి ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ పాలసీలో మార్పులు చేసింది చైనా.
అదేమంటే… ఇక నుంచి చైనాలో జంటలు గరిష్ఠంగా ముగ్గురు పిల్లలను కూడా కనవచ్చని తెలిపింది. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఏమిటి అంటే… ఆ దేశంలో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది అట. పెరిగిపోతోన్న జనాభాను నియంత్రించేందుకు.. 1970 నుంచి 2016 వరకు ఒకే సంతానం అనే నినాదాన్ని అమలు చేసింది చైనా. అలాగే 2016 నుంచి ఇద్దరు పిల్లలను కనడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు ఆ సంఖ్యను ముగ్గురికి పెంచడం విశేషం. దీనికి ఆ దేశ అధ్యక్షుడు, సీపీసీ ప్రధాన కార్యదర్శి జీ జిన్పింగ్ నేతృత్వంలో జరిగిన కేంద్ర కమిటీ ఆమోదం తెలిపింది. చైనా జనాభా నిర్మాణ పద్ధతిని వృద్ధి చేయడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని అక్కడి విశ్లేషకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అదేవిధంగా ఈ ముగ్గరు పిల్లల విధానాన్ని చట్టానికి అనుగుణంగా అమలు చేయడానికి పార్టీ కమిటీలు, ప్రభుత్వాలు అన్ని స్థాయిలలో ప్రణాళికబద్దంగా పనిచేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. అన్ని స్థాయిలలోని అధికారులు జననాలు, సంబంధిత ఆర్థిక, సామాజిక విధానాల సమన్వయాన్ని ప్రోత్సహించాలని, ప్రధాన ఆర్థిక, సామాజిక విధానాల జనాభా ప్రభావ అంచనా విధానాన్ని మెరుగుపర్చాలని ఆదేశించారు కూడా. కాగా 2016లో ఇద్దరు పిల్లల విధానాన్ని అమలు చేసిన ఐదు సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *