భారీగా పెరిగిన పెట్రోల్ ధరలు…..!
దేశంలో కరోనా విలయ తాండవం చేస్తుంది. ఇదే సమయంలో ప్రజలకు మరింత భారంగా పెట్రోల్ ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ పెట్రోల్ ధరలు పెరుగుదల సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. అలాగే కొన్ని ప్రాంతాల్లో సెంచరీ కూడా దాటేశాయి. కానీ.. ఎప్పుడైతే నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిందో.. అప్పటి నుంచి ఆగిపోయాయి. ఆ తర్వాత విచిత్రంగా పెట్రోల్ ధరల్ నింగిని అంటుతున్నాయి.
అయితే తాజాగా వాహనదారులకు పెట్రోల్ ధరలు షాక్ ఇచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 28 పైసలు, లీటర్ డీజిల్ పై 26 పైసలు పెరిగింది. ఈ పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.94 చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ. 84.89 కు చేరింది. కాగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సెంచరీని దాటింది. లీటర్ పెట్రోల్ ధర రూ. 100.19 చేరగా.. డీజిల్ ధర రూ. 92.17 కు చేరింది. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.63 చేరగా.. డీజిల్ ధర రూ. 92.54 కు చేరింది. అంతేకాకుండా ఏపీలోని కొన్ని జిల్లాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ దాటాయి. విజయవాడ విషయానికి వస్తే లీటర్ పెట్రోల్ ధర రూ. 100.11గా నమోదు కావడం వాహనదారులను ఆందోళన కలిగిస్తుంది.
Type a message