బ్రేకింగ్… ఏపీలో టెన్త్ పరీక్షలు వాయిదా….
ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. రోజువారి కేసులు ఇంకా ఎక్కువగానే నమోదవుతున్నాయి. దీంతో మరోసారి పదో తరగతి పరీక్షలు వాయిదా వేసింది ఏపీ సర్కార్. అందుకు సంబంధించి పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్టు హైకోర్టుకు తెలిపింది ఏపీ ప్రభుత్వం. పదో తరగతి పరీక్షలు ప్రభుత్వ టీచర్లకు వ్యాక్సిన్ వేసిన తర్వాత నిర్వహించాలని.. అప్పటి వరకు వాయిదా వేయాలన్న పిటిషన్ పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది.
అయితే ఈ టెన్త్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు హైకోర్టుకు తెలిపింది ఏపీ ప్రభుత్వం. అంతేకాకుండా ఇప్పుడే తాము స్కూల్స్ తెరిచే ఆలోచన కూడా లేదని ప్రభుత్వం పేర్కొంది. అలాగే పదవ తరగతి పరీక్షలపై లిఖిత పూర్వకంగా తెలపాలని ఏపీ సర్కార్ ను హైకోర్టు ఆదేశించింది. కాగా పదో తరగతి పరీక్షలపై జులైలో మళ్లీ సమీక్షించి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది.