ఇక సినిమాలకు రాం.. రాం: చంద్రమోహన్
విభిన్నమైన చిత్రాల్లో వైవిధ్యభరితమైన పాత్రలు నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు చంద్రమోహన్. తాజాగా 81 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చంద్రమోహన్ ఇకపై తాను నటనకు స్వస్తి పలకనున్నట్లు తెలిపారు. 1966లో రంగులరాట్నం నుంచి ఇప్పటి వరకూ తన 55 ఏళ్ళ సినిమా కెరీర్ లో దాదాపు 930కి పైగా సినిమాల్లో నటించారు చంద్రమోహన్.
ముఖ్యంగ చంద్రమోహన్ హీరోగా తన కెరీర్ ను ప్రారంభించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సహాయ నటుడిగా, కమిడియెన్ గా ఎన్నో పాత్రలకు జీవం పోశారు. అయితే ఇంకా తాను నటిస్తూ… దర్శకనిర్మాతలను ఇబ్బంది పెట్టదలచుకోవడం లేదని అన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆయన ‘రాఖీ’ సినిమా తర్వాత బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ఆ తర్వాత చంద్రమోహన్ ‘దువ్వాడ జగన్నాథమ్’ వంటి సినిమాలలో తనకోసమే కొన్ని రోజులు షూటింగ్ ను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. మొత్తానికి వయస్సు పయి పడిన రీత్యా తాను ఇక కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుదల్చుకున్నట్లు తెలిపినట్లు సమాచారం అందుతుంది. కాగా సౌత్ ఇండియాలోని మూడు తరాల నటీనటులతో కలసి నటించిన నటులలో చంద్రమోహన్ ఉండటం నిజంగా ఆయనకు దక్కిన గొప్ప అవకాశంగానే భావించవచ్చు.