ఆనందయ్య కరోనా మందుపై ప్రభుత్వం కూడా సీరియస్ యాక్షన్ ప్లాన్…

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణపట్నం ఆనందయ్య తయారు చేసిన కరోనా మందు పంపిణీకి తాత్కాళిక బ్రేక్ పడింది. మళ్లీ ఎప్పటి నుంచి మందు పంపిణీ ప్రారంభిస్తారు అనే విషయంపై క్లారిటీ రాలేదు. అయితే మందు పంపిణీని నిలిపివేయడంతో ఎవరూ కృష్ణపట్నం రావొద్దని ఆనందయ్యతో పాటు.. స్థానిక ఎమ్మెల్యే కూడా చెప్తూనే ఉన్నారు.
కానీ ఆనందయ్య మందుపై ఇప్పటికే ఐసీఎంఆర్ టీం, ఆయుష్ అధికాలు పరీక్షలు చేస్తున్నారు. ఈ పరీక్షల తుది నివేదిక వచ్చిన తర్వాతే మందు తయారు చేయడం గానీ, పంపిణీ గానీ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అదేవిధంగా ఆ మందు ప్రజల నుంచి ఉన్న డిమాండ్పై అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. చాలా సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో కృష్ణ పట్నం మందుపై శాస్త్రీయంగా పరీక్షలు జరిపిన తర్వాతనే తర్వాతి స్టెప్ వేయాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే.. వేల మందికి ఒక్కరోజు మందు తయారీ సాధ్యం కాదని నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఏపీ మంత్రి పేర్ని నాని కూడా రహస్యంగా ఎవరికీ తెలియకుండా గత రాత్రి నెల్లూరుకు చేరుకొని అక్కడ ఓ హోటల్ రూమ్ లో ఆనందయ్యతో సమావేశం జరుపుతున్నారు. దీన్ని బట్టి ప్రజలకు ఉపశమనం కలిగించేది అది ఏపాటిదైనా త్వరిత గతిన ఆమందుపై ప్రభుత్వం కూడా ఓ క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. కాగా కృష్ణపట్నం గ్రామానికి కరోనా మందు కోసం పెద్ద సంఖ్యలో జనం ఇంకా తరలివస్తూనే ఉన్నారు. మందు లేదని తెలియడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. దీంతో కొంతమంది కేటుగాళ్లు బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు సాగిస్తుండటం విశేషం. చూద్దాం ఆనందయ్య కరోనా మందు ప్రజల్లో ముందు ముందు ఎంతటి ప్రభావాన్ని చూపుతుంది అనేది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *