ఈ కరోనా వేళ వైఎస్ షర్మిల గొప్ప ప్రకటన….
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు 4 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద ఎత్తున నమోదౌతున్న ఈ వేళ వైఎస్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. కరోనా బాధితులను అదుకొనేందుకు ‘ఆపదలో తోడుగా YSSR’అనే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నట్లు షర్మిల పేర్కొన్నారు. ‘తెలంగాణ ఆడబిడ్డలారా.. ధైర్యం కోల్పోకండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడటానికి .. మళ్ళీ మీ జీవితం సాఫీగా సాగేందుకు.. మీరంతా మన YSR కుటుంబసభ్యులుగా భావించి.. నా వంతుగా మీకు ఏదైనా సహాయం చేయాలనుకొంటున్నాను. ‘ఆపదలో తోడుగా YSSR టీం’ ఫొన్ నంబరు 040-48213268 కు మీ సమాచారాన్ని తెలియజేయండి. తమ కుటుంబాలకు ఆర్థిక అండగా నిలిచే ఎంతోమంది ఈ కరోనా బారిన పడి చనిపోయారు. కుటుంబ పెద్దదిక్కు తండ్రి / భర్త / కొడుకును కరోనాకు కోల్పోయి కుటుంబాన్ని నెట్టలేక నిరాశ, నిస్పృహలతో కృంగిపోతున్న మహిళల బాధను కాస్తైనా పంచుకోవాలని “ఆపదలో తోడుగా YSSR టీం” ఏర్పాటు చేస్తున్నాను’ అంటూ షర్మిల సంచలన ప్రకటన చేశారు. మొత్తానికి ఓ రాజకీయ నేతగా తెలంగాణలో ఎదగాలని భావిస్తున్న వైఎస్ షర్మిల ఈ నిర్ణయం ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు.