ఇక అమెరికాలో మాస్క్ పెట్టక్కరలేదు…
ప్రపంచాన్ని కరోనా అల్లకల్లోలం చేసింది. ఇప్పటికీ ఇండియాలో విలయం తాండవం చేస్తుంది. ఈ కరోనా బారిన పడి ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. ముఖ్యంగా చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తుంది.
అయితే మొన్నటి వరకు అమెరికాను వణికించిన కరోనా మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడుతుంది. తాజాగా అమెరికన్లకు అక్కడి ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. మాస్కులు ధరించడంపై అమెరికన్లకు ఆ దేశ వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం (సీడీసీ) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న ప్రజలు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అలాగే కరోనాతో నాడు అత్యంత దారుణంగా ప్రభావితమైన అమెరికా.. సాధారణ పరిస్థితుల వైపు శరవేగంగా అడుగులు వేస్తోంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనంగా చెప్పవచ్చ. కాగా సీడీసీ ప్రకటనపై అధ్యక్షుడు జో బైడెన్ హర్షం వ్యక్తం చేశారు. అమెరికన్లకు వ్యాక్సిన్లను శరవేగంగా అందిస్తుండటం వల్లే ఈ మైలురాయి సాధ్యమైందని ఆయన వెల్లడించారు