ఢిల్లీలో 100 పడకల ఆసుపత్రికి హాలీవుడ్ నటి సాయం…
దేశంలో కొవిడ్ కేసులు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరణాల సంఖ్య కూడా రోజూ సుమారు 4 వేల మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఆసుపత్రులలో బెడ్స్ లేక ఆక్సిజన్ అందక ఎంతోమంది చనిపోతున్నారు. ఈ సమయంలో హాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.
అయితే ఢిల్లీలో ఆక్సిజన్ ప్లాంట్ తో పాటు 100 పడకల హాస్పిటల్ నిర్మిస్తామని ప్రకటించారు ఖురేషీ. హాలీవుడ్ డైరెక్టర్ జాక్ స్నైడర్ తో, సేవ్ ది చిల్డ్రన్ సంస్థతో కలిసి పనిచేస్తూ తాత్కాలిక హాస్పిటల్ ను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ట్వీట్ చేసిన ఖురేషీ… ఇంకా రోగులకు ఇంట్లోనే చికిత్స అందించడానికి వీలుగా కొవిడ్ స్పెషల్ కిట్స్ కూడా అందిస్తామని అన్నారు. కాగా ఇండియాలో పెరుగుతున్న కరోనా కేసులు… వైద్యం దొరకక జనం పడుతున్న ఇబ్బందులు తనను ఎంతగానో బాధించాయని వెల్లడించారు. అందుకే తనవంతుగా సాయం చేసి బాధితులకు అండగా నిలబడతానని వివరించారు హ్యూమా ఖురేషి. అయితే ముందుముందు హ్యూమా ఖురేషి బాటలో ఇంకెంత మంది సెలబ్రెటీలు బయటకు వచ్చి ఈ కరోనాతో ప్రజలు జరుపుతున్న యుద్ధానికి సాయం అందిస్తారో చూడాలి.