ఇక అమెరికా నుంచి ఇండియాకి డైరెక్ట్ గూగుల్ పే చేసుకోవచ్చు…
గూగుల్ పే యాప్ మరో గుడ్ న్యూస్ వెల్లడించింది. గూగుల్ పే యాప్ వినియోగదారులు ఇకపై అమెరికా నుంచి భారత్, సింగపూర్ యూజర్లకు డబ్బులు పంపే వెసులుబాటును కల్పించింది. అందుకు సంబంధించి యూజర్లకు ఈ సదుపాయాలు కల్పించేందుకు ఆర్థిక సేవల సంస్థలు వెస్ట్రన్ యూనియన్, వైజ్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నట్లు టెక్‌క్రంచ్ మొదట ఓ కథనాన్ని వెల్లడించింది.
ఆ తర్వాత గూగుల్ పే సంస్ధ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. అంతేకాకుండా ఆర్థిక సేవల సంస్థలు వెస్ట్రన్ యూనియన్ తో నగదు బదిలీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో ఇకపై అమెరికా యూజర్లు మరో 200 దేశాలకు, వైజ్ ద్వారా 80 దేశాలకు డబ్బు పంపే సౌకర్యాలు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని గూగుల్ పే వెల్లడించింది