కరోనా టైంలో.. రాధేశ్యామ్ టీం రియల్ సాయం….

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘రాధే శ్యామ్’. ఈ సినిమా కోసం ఇటలీ బ్యాక్ డ్రాప్ లో 1970కి చెందిన ఓ హాస్పిటల్ సెట్ ను తాజాగా ఓ స్టూడియోలో వేశారు. అందుకు సంబంధించిన చిత్రీకరణ మొత్తం ఇప్పటికే పూర్తయి పోయింది. హైదరాబాద్ అవుట్ కట్స్ లో నిర్మాత ఈ హాస్పిటల్ సెట్ కు సంబంధించిన పరికరాలు, సామాగ్రి మొత్తాన్ని సురక్షితంగా దాచి ఉంచారు. ఇంతలో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్స్ లో బెడ్స్ కొరత ఉందని తెలుసుకున్న ‘రాధేశ్యామ్’ ఆర్ట్ డైరెక్టర్ రవీంద్ర రెడ్డి తమ సినిమా కోసం తయారు చేసిన 50 బెడ్స్ ను ఆ హాస్పిటల్ కు ఇద్దామని నిర్మాతతో చెప్పారు. యూవీ క్రియేషన్స్ అధినేతలు ప్రమోద్, వంశీ కూడా అందుకు అంగీకరించడంతో ఈ మధ్యనే మొత్తం ఏడు పెద్ద ట్రక్స్ లో యాభై మంచాలను, షూటింగ్ కోసం తయారు చేసిన స్ట్రెక్చర్స్, సెలైన్ స్టాండ్స్ వంటి వస్తువులన్నింటినీ హాస్పిటల్ కు డొనేట్ చేశారు.
అయితే తమ సినిమా కోసం తయారు చేసిన వాటిని ఈ కరోనా కష్టకాలంలో ఇలా ఉపయోగించడం చాలా సంతోషంగా ఉందని హీరో ప్రభాస్ తో పాటు దర్శక నిర్మాతలూ తెలిపారు. మొత్తానికీ ‘రాధేశ్యామ్’ హాస్పిటల్ సెట్ కోసం రూపొందించిన ప్రతి ఉపయోగపడే వస్తువు రియల్ హాస్పిటల్ కు చేరడం, అక్కడ కరోనా బాధితుల కోసం వాటిని వాడటం నిజంగా చాలా గొప్ప విషయమే కదా. గ్రేట్ రాధేశ్యామ్ టీం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *