మాస్క్ పెట్టుకోండి ప్లీజ్ : రవిబాబా ప్రచారం…
టాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు అయిన రవిబాబు వ్యక్తిత్వం చాలా విలక్షణమైనది. ఏ విషయాన్ని కుండబద్ధలు కొట్టినట్లుగా నిర్భయంగా చెప్పడం ఆయన నైజం. దేనికీ వెరవని మనస్తత్వం ఆయన సొంతం. గత సంవత్సరం కరోనా వచ్చి ఇలా తగ్గిందో లేదో తన సినిమా ‘క్రష్’ బాలెన్స్ షూటింగ్ ను మొదలు పెట్టేశాడు. అయితే కరోనాకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటూనే చేశారు. అప్పుడు కూడా కరోనా సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ సినిమా షూటింగ్ సందర్భంగా తెలియచేశాడు రవిబాబు.
అదేవిదంగా కరోనాతో మారిన జనం అలవాట్లనూ ఫన్నీ వీడియోలలో చూపించాడు. తాజాగా ఒక మాస్క్ కాదు రెండు మాస్కులు వేసుకోమని చెబుతున్నారని, దానిని కూడా పాటించమని మొర పెట్టుకుంటున్నాడు రవిబాబు. మనల్ని మనం రక్షించుకోడానికి మాస్క్ పెట్టుకోక తప్పదని హితవు పలుకాడు. మరి రవిబాబు మాటలు విని అందరూ మాస్క్ లు పెట్టుకోండి. బ్రతికి సాధించండి.