టాలీవుడ్ డైరెక్టర్ వట్టి కుమార్ కరోనాతో మృతి
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ కరోనాతో మృతి చెందడం తీవ్ర కలకలం రేగుతుంది. దేశంలో ఇప్పటికే కరోనా వైరస్ విలయ తాండవం చేస్తుంది. ఈ వైరస్ కు పేద, ధనిక అన్న తేడా లేకుండా అందరికీ సోకుతోంది. బాలీవుడ్, టాలీవుడ్ లలో సినీ దిగ్గజాలను కాటు వేస్తుంది.
అయితే ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా సినీ తెలుగు పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వర్ధమాన సినీ దర్శకుడు వట్టి కుమార్(38) కోవిడ్ తో మృతి చెందారు. రాగోలు జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వట్టి కుమార్ మరణించారు. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డ వట్టి కుమార్.. ఈ మధ్య ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఆయన పరిస్థితి విషమించడంతో ఈరోజు తుదిశ్వాస విడిచాడు వట్టి కుమార్. కాగా వట్టి కుమార్ సొంతూరు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట. ‘మా అబ్బాయి’ సినిమాకి గాను దర్శకత్వం వహించిన వట్టికుమార్.. ప్రస్తుతం ‘సర్కారువారి పాట’ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తుండటం విశేషం. కాగా వట్టి కుమార్ మృతి పట్ల పలుగురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.