5మిలియన్ మార్క్ వద్ద ఎన్టీఆర్ అనుసర గణం…
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు భారీస్థాయిలో అనుసరగణం ఉన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ సినిమా విడుదల అవుతుంది అంటేనే నందమూరి అభిమానుల హడావుడి మాములుగా ఉండదు. ఇక సోషల్ మీడియా ట్రెండింగ్స్ తో అంతకంతకూ చెలరేగిపోతుంటారు.
అయితే తాజాగా ఎన్టీఆర్ సోషల్ మీడియాలో మరో మైలురాయిని అందుకున్నారు. నిన్న నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా… ఒకేరోజు తారక్ ను దాదాపు 2 వేల మంది అనుసరించడం విశేషం. దీంతో ట్విట్టర్ ఖాతాలో తారక్ అభిమానుల సంఖ్య 5 మిలియన్లకు చేరుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో #5MFollowersForNTR అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్. అలాగే ఇప్పుడు సౌత్ లో 50 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న అతికొద్దిమంది స్టార్స్ లో తారక్ ఒకరుగా చెప్పవచ్చు. ఎన్టీఆర్ ప్రస్తుతం చరణ్ తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కొరటాలతో కలిసి ‘ఎన్టీఆర్30’, ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్31’ సినిమాల్లో వరుసగా నటించనుండటం విశేషం.