400 గిరిజన కుటుంబాలకు రానా సాయం….
తెలంగాణలో గిరిజన ప్రాంతంలోని వందల కుటుంబాలకు టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి సాయం అందించారు. కరోనా సమయంలో గిరిజన కుటుంబాలకు సాయం అందించడం ఎంతైనా విశేషమనే చెప్పాలి. కోవిడ్ -19 సెకండ్ వేవ్ సమయంలో ఎంతో మంది పేదవారు ఇబ్బంది పడుతున్నారు. ఇదే సమయంలో పలువురు సెలబ్రిటీలు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా స్టార్ హీరో రానా దగ్గుబాటి నిర్మల్ జిల్లాలోని 400 గిరిజన కుటుంబాలకు సాయం అందించడానికి ముందుకు వచ్చారు.
ముఖ్యంగా నిర్మల్ జిల్లాలోని గిరిజన గ్రామాలైన అలారంపల్లి, బాబా నాయక్ రాండా గ్రామ పంచాయతీలు, గుర్రాం మధీరా, పాల రెగాడి, అడ్డాల తిమ్మపూర్, మిసాలా భూమన్న గూడెం, గగన్నపేట, కనిరామ్ తాండా, చింతగుడమ్, గోంగూరం గుడా, కడెం మండలాలలోని కుగ్రామాల ప్రజలకు కిరాణా సామాగ్రి, మందులు అందించారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఎంతో హర్షం వ్యక్తం చేశారు.
కాగా రానా ‘అరణ్య’తో కరోనా సమయంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ తో ‘అయ్యప్పనమ్ కోషియం’ తెలుగు రీమేక్, వేణు ఉడుగుల ‘విరాటా పర్వం’ సినిమాలలో నటిస్తున్నారు. అంతేకాకుండా భారీ విఎఫ్ఎక్స్ తో అతీంద్రియ శక్తుల నేపథ్యంలో మిలింద్ రౌ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ చిత్రానికి కూడా రానా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం.