2008 డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్…

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2008 డీఎస్సీ అభ్యర్ధులకు శుభవార్త చెప్పింది. సుమారు 2,193 మంది అభ్యర్ధులకు న్యాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మినిమమ్ టైమ్ స్కేల్తో వెంటనే ఎస్జీటీలుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామంగా మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. అలాగే 12 ఏళ్ల సుదీర్ఘ కాలం ఎదురు చూపుల తర్వాత 2008 డీఎస్సీ అభ్యర్థులకు సీఎం జగన్ న్యాయం చేశారని ఆయన అన్నారు. ఎంతో మానవతా దృక్పథంతో డీఎస్సీ అభ్యర్ధుల సమస్యను పరిష్కరించారని ఆదిమూలపు సురేష్ వివరించారు. అలాగే 486 పీఈటీలు, స్కూల్ అసిస్టెంట్ పీఈటీలకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తున్నామని స్పష్టం చేశారు. కాగా ఈరోజు జరిపిన మీడియా సమావేశంలో టెట్-2021 సిలబస్ను మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేయడం విశేషం.
అయితే గతంలో బీఈడీ అభ్యర్ధులు చాలా అవకాశాలు కోల్పోయారని మంత్రి సురేష్ ఈ సందర్భంగా వివరించారు. 2008 డీఎస్సీ అభ్యర్ధులను గత ప్రభుత్వం అసలు పట్టించుకోలేదని, డీఎస్సీ అభ్యర్ధులను కూడా చంద్రబాబు మోసం చేశారని మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శనాస్త్రాలు సంధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *