14న సాగర్ ప్రచారానికి సీఎం కేసీఆర్..
తెలంగాణలోని నాగార్జున సాగర్ ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నోముల నర్సింహయ్య అకాల మరణంతో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. అయితే ఈ ఉప ఎన్నిక ఏప్రిల్ 17వ తేదీన జరుగనుంది. దీంతో అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారంలో దూసుకుపోతున్నాయి.
ముఖ్యంగా నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై అన్ని పార్టీలు దృష్టి సారించినా.. అధికార టీఆర్ఎస్ మాత్రం మరికాస్త దూకుడు పెంచింది. వినూత్నంగా ప్రచారంలో దూసుకుపోతుంది. పార్టీలన్నీ పోటాపోటీ ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఇక ప్రచారంలో పార్టీలు, నేతలు దూకుడు పెంచారు. సాగర్ ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు అభ్యర్ధులు వినూత్నంగా ప్రచారం చేసున్నారు. సాగర్ ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకున్న ఈ సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా ప్రచార రంగంలోకి దిగుతున్నారు. కాగా 14న అనుములలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. కేసీఆర్ సభ కోసం టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుండటం విశేషం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆ సభలో సీఎం కేసీఆర్ ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. అలాగే నాగార్జున సాగర్ కు మరిన్ని వరాలు కూడా కురిపించే అవకాశాలు లేకపోలేదు అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది.