హైకోర్ట్ జడ్జిలను పెంచుతూ సీజేఐ ఎన్వీ రమణ కీలక నిర్ణయం….

తెలంగాణ హైకోర్టులో ఎన్నాళ్ల నుంచో విజ్ఞప్తి చేస్తున్న ఓ కీలక అంశానికి గ్రీన్ సిగ్నల్ పడింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ చొరవతో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య భారీగా పెరిగింగి. ఈ న్యాయమూర్తుల సంఖ్య ఏకంగా 75 శాతం పెంచి ఎన్వీ రమణ చరిత్ర సృష్టించారు. ఈ పెరిగిన జడ్జిలతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42కి పెరిగింది.
అయితే న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని కోరుతూ తెలంగాణ హైకోర్టు నుంచి గత రెండేళ్లుగా సుప్రీంకోర్టుకు పలు రకాలుగా విజ్ఞప్తులు చేశారు. అందుకు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అనుమతులు రాకపోవడం విశేషం. హైకోర్టు న్యాయమూర్తుల నియామకం సుప్రీంకోర్టు కొలీజియం ద్వారా జరుగుతుండగా.. వివిధ రాష్ట్రాల హైకోర్టుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను జస్టిస్ ఎన్వీరమణ పరిశీలిస్తున్నారు. దీంతో తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను ఏకంగా 75 శాతం వరకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకోవడంతో న్యాయమూర్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ హైకోర్టు విజ్ఞప్తిని మన్నించిన భారత ప్రధాన న్యాయమూర్తి.. న్యాయమూర్తుల సంఖ్యను పెంచడంతో ఇక పెండింగ్లో ఉన్న కేసులు మరింత వేగంగా ముందుకు కదిలే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *