హైకోర్టుకు నిమ్మగడ్డ.. సీబీఐ విచారణ జరపాలి..
ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ నిమ్మగడ్డ వ్యవహారం మరింత ముదురుతుంది. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో కేసు ఫైల్ చేశారు. తాను గవర్నర్ తో జరుపుతున్న ప్రతీదీ బయటకు వస్తున్నాయని, గవర్నర్ తో జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలు బయటకు వెలువడటం ఆందోళన కలిగిస్తుందని, అలా ఎలా సాధ్యం అవుతుందో తెలియడం లేదని పేర్కొన్నారు.
అంతేకాకుండా అవి సోషల్ మీడియాలో లేఖలు ప్రత్యక్షం అవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని.. ఇదే విషయాన్ని మంత్రులు కూడా చెప్తున్నారని, ఈ విషయంపై సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరుతూ నిమ్మగడ్డ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎస్, మంత్రులను ప్రతివాదులుగా చేర్చారు. కాగా ఎస్ఈసి నిమ్మగడ్డ వేసిన పిటిషన్ ఈరోజు విచారణకు రానుంది. మరి కోర్ట్ ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి.