హీరోయిన్ హన్సిక ఇంట పెళ్లి సందడి
టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో దేశముదురు సినిమాతో వెండితెరకు పరిచయం అయిన హన్సిక.. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా తెలుగు తెరకు దూరంగా ఉన్న ఈ బొద్దుగుమ్మ.. కోలీవుడ్లో మంచి విభిన్నమైన సినిమాలతో అలరిస్తుంది.
అయితే సహజంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే హన్సిక… తాజాగా తన సోదరుడు పెళ్లికి సంబంధించిన ఫొటోలను తన అకౌంట్ లో షేర్ చేసింది. హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీకి టెలివిజన్ నటి ముస్కాన్ నాన్సీతో జైపూర్లో వివాహం జరిగింది. ఈ వేడుక చాలా కొద్దిమంది సన్నిహితులు, బంధువుల మధ్య జరిగింది. మార్చి 21న ఎంగేజ్మెంట్తో మొదలైన ఈ సంబరాలు పెళ్లితో ముగియడం విశేషం. ఈ పెళ్లిలో ట్రెండీ లుక్తో కనిపించిన హన్సిక తెగ హడావుడి చేసింది. కాగా సోదరుడి వేడుకల్లో హన్సిక తెగ ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది.