స్టాలిన్ కు సౌందర్య రజినీ కాంత్ కోటి విరాళం….
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ఎం.కె. స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి వినూత్నంగా పరిపాలన సాగిస్తున్నారు. కరోనా కాలంలో ముఖ్యంగా ఆరోగ్యంపై దృష్టి సారించి వినూత్నమైన పంథాలో కరోనాను తరిం కొట్టేందుకు నడుం భిగించారు.
ముఖ్యంగా తమిళనాడులో స్టాలిన్ ను కలిసిన పలువురు సినీ ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు. నిన్న హీరో సూర్య కుటుంబం సీఎం స్టాలిన్ ను కలిసి కోటి రూపాయలు అందజేసారు. మరి ఈరోజు రజనీకాంత్ తనయ సౌందర్య రజనీకాంత్ స్టాలిన్ ను కలిసి కోటి రూపాయలను విరాళంగా అందించారు. సౌందర్య తన భర్త విశాఖన్ కి చెందిన ఫార్మా కంపెనీ అపెక్స్ లాబెలేటరీస్ తరపున ఈ విరాళం అందచేసినట్లు వెల్లడించారు. కరోనా రిలీఫ్ కోసం ఈ విరాళం అందించారు. కాగా తన మామగారైన యస్.యస్. వన్గమూడి, భర్త, ఆయన సోదరితో కలసి స్టాలిన్ ని సౌందర్య రజనీకాంత్ కలవడం విశేషం.