సౌత్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్…
సౌత్ లోని ఓ ద్విభాషా చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటిస్తుంది. కిచ్చా సుదీప్ హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక బహుభాషా చిత్రం ‘విక్రాంత్ రోనా’. ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఓ కీలకమైన పాత్రలో నటిస్తోంది. అయితే తాజాగా ఆమె ఈ సినిమాలోని సాంగ్ షూటింగ్ పూర్తి చేసింది. బెంగళూరులో ఈ సాంగ్ షూట్ పూర్తి చేసుకోవడం విశేషం. కాగా ‘విక్రాంత్ రోనా’తో జాక్వెలిన్ కన్నడ సినీ రంగంలోకి అడుగు పెట్టింది.
అదేవిధంగా సుదీప్, జాక్వెలిన్ ల మధ్య వచ్చే ఈ సాంగ్ షూటంగ్ ను మేకర్స్ తాజాగా పూర్తి చేశారు. భారీ హైప్ తో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రంలో జాక్వెలిన్ కూడా నటించడంతో ఇక అంచనాలు భారీగా పెరిగి పోయాయి. అంతేకాకుండా సుదీప్తో కలిసి పని చేయడం బాగుందని ఆమె పేర్కొన్నారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ విభిన్నమైన కథాంశాలను ఎంచుకొని దూసుకెళ్తోంది. కాగా ‘భూత్ పోలీస్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాక్వెలిన్ ప్రభాస్ తో ‘సాహో’లో ఓ స్పెషల్ సాంగ్ లో అలరించిన విషయం తెలిసిందే.