సుప్రీం కోర్టు సీజేగా ఎన్వీ రమణ పై స్పష్టత…
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే తరువాత ఆ స్థానంలో ఎవర్ని నియమించబోతున్నారు అనే దానిపై చాన్నాళ్లుగా ఉత్కంఠ నెలకొంది. తాజాగా ఈ విషయంపై క్లారిటీ వచ్చినట్లైంది. అయితే సుప్రీం చీఫ్ జస్టిస్ బాబ్డే తర్వాత సీనియర్ గా ఉన్న న్యాయమూర్తి ఎన్వీ రమణను ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని న్యాయశాఖకు లేఖ రాశారు. దీంతో న్యాయశాఖ ఆ లేఖను హోంశాఖకు అక్కడి నుంచి రాష్ట్రపతికి సిఫారసు చేయనున్నారు.
అయితే ఏప్రిల్ 23వ తేదీన జస్టిస్ బాబ్డే పదవీ విరమణ చేయబోతున్నారు. బాబ్డే పదవీ విరమణ తర్వాత సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ ప్రమాణస్వీకారం చేస్తారు. జస్టిస్ ఎన్వీ రమణ 16 నెలలపాటు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయనుండటం విశేషం. కాగా ఎన్వీ రమణ ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో జన్మించారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నాయమూర్తిగా, ఢిల్లీ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవం ఉంది. ఇప్పడు సుప్రీకోర్టులో జస్టిస్ బాబ్డే తర్వాత సీనియర్ న్యాయమూర్తిగా ఎన్వీ రమణ ఉండటం విశేషం.